తెలంగాణలో కొత్తగా 1,602 పాజిటివ్‌ కేసులు

- November 06, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 1,602 పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 1,602 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 982 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,47,284 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,26,464 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1366కి చేరింది. ప్రస్తుతం 19,272 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 16,522 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 295 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 118 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.

 

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com