1 మిలియన్ బహ్రెయినీ దినార్స్ విలువైన డ్రగ్స్ స్మగ్లింగ్
- November 06, 2020
మనామా:బహ్రెయిన్‌లో 1 మిలియన్ బహ్రెయినీ దినార్స్ విలువైన డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టుని రట్టు చేశారు యాంటీ నార్కోటిక్స్ పోలీస్ అధికారులు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం నలుగురు వ్యక్తుల్ని రెండు వేర్వేరు ఘటనల్లో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద కస్టవ్స్‌ు అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు 24 నుంచి 40 ఏళ్ళ మధ్య వయసున్నవారు. ముగ్గురు ఆసియా జాతీయులు ఇందులో వున్నారు. నిందితుల గురించి పోలీసులకు సమాచారం అందడంతో పక్కా వ్యూహంతో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. 34 ఏళ్ళ వ్యక్తి 2.5 కిలోల నార్కోటిక్స్‌ని తరలిస్తూ తొలుత పట్టుబడ్డారు. 40 ఏళ్ళ వ్యక్తి నుంచి 3.5 కిలోగ్రాముల నార్కోటిక్ సబ్‌స్టాన్స్‌ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్‌షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్‌లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్‌కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్‌లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









