హైసియా 28వ వార్షిక ఇన్నోవేషన్‌ సదస్సు మరియు అవార్డుల కార్యక్రమం

- November 06, 2020 , by Maagulf
హైసియా 28వ వార్షిక ఇన్నోవేషన్‌ సదస్సు మరియు అవార్డుల కార్యక్రమం

హైదరాబాద్:గురువారం జరిగిన హైసియా అవార్డుల కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కే. తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు. కొవిడ్‌-19 కష్టకాలంలో కూడ హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ స్థిరంగా నిలవటమే కాకుండా తన సత్తా చాటిందన్నారు .గత ఆర్థికసంవత్సరంలో దేశీయంగా సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు 8 శాతం పెరిగితే.. తెలంగాణ ఐటీ ఎగుమతులు 18 శాతం పెరిగాయని అన్నారు.

అత్యధిక ఐటీ ఎగుమతులు చేసిన కంపెనీలుగా ఎంఎన్‌సీల విభాగంలో కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ,డెలాయిట్‌ అవార్డులు అందుకున్నాయి.దేశీయ విభాగంలో ఇన్ఫోసిస్‌, టిసిఎస్ లు ఈ అవార్డులు దక్కించుకున్నాయి .
2019 -20 ఏడాదికి నికరంగా అత్యధిక మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీగా కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ నిలిచింది.అధిక ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీగా టీసీఎస్‌ అవార్డు అందుకుంది.బెస్ట్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్‌, అత్యధికంగా వృద్ధి చెందుతున్న కంపెనీ, చిన్న ఐటీ కంపెనీలు మొదలైన విభాగాల్లో హైసియా అవార్డులు ప్రదానం చేసింది.

 కొవిడ్‌-19 కష్టకాలంలో ఐటీ పరిశ్రమకు అండగా నిలిచి వారికి అన్ని విదాల తోడ్పాటును అందించిన సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌కు ‘ప్రత్యేక గుర్తింపు’ అవార్డు ఇవ్వడం జరిగింది.

--పవన్ బసిరెడ్డి(మాగల్ఫ్ ప్రతినిధి,హైదరాబాద్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com