గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతం – హీరోయిన్ ఆదాశర్మ
- November 06, 2020
హైదరాబాద్:గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నిరంతర ప్రవాహినిలా సాగుతుంది. శ్రీరంగం నుంచి శ్రీనగర్ దాక పచ్చదనాన్ని పరుస్తుంది. వేళ్లు వేర్లను నేలకు పరిచేయం చేస్తూ.. హృదయాలు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” బాధ్యతల్ని వంతుల వారిగా పంచుకుంటున్నాయి. ఇప్పుడు దేశమంతా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఒక ట్రెండ్. పచ్చదనాన్ని ప్రేమించే మనుషుల ట్రెండ్.
ఇంతటి అద్భుతమైన కార్యక్రమంలో ఈ రోజు సిల్వర్ స్క్రీన్ సిల్క్ పోగు, తన అందంతో యువతకు “సహార్ట్ ఎటాక్” లు తెప్పించిన బ్యూటీబ్రాండ్ ‘ఆదాశర్మ’ . క్వశ్చన్ మార్క్(?) సినిమా నిర్మాత గౌరీ కృష్ణ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు ముంబై లోని తన నివాసంలో మొక్కలు నాటిన ఆదాశర్మ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది.
ఇంత నిస్వార్ధంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ని అభినందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతమైనది అని ప్రతీ ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటలని కోరారు. ముఖ్యంగా తన అభిమానులు అందరూ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..