పార్లమెంటు వెబ్సైట్ హ్యాకింగ్: ఈజిప్టియన్ వలసదారుడి అరెస్ట్
- November 06, 2020
కువైట్ సిటీ: కువైట్ టాప్ కోర్టు, ఓ వ్యక్తికి ఐదేళ్ళ జైలు శిక్షను సమర్థించింది. కేసు వివరాల్లోకి వెళితే, నేషనల్ అసెంబ్లీలో ఉద్యోగి అయిన ఓ ఈజిప్టియన్ వలసదారుడు, అడ్మినిస్ట్రేటర్స్ అకౌంట్స్‌ని హ్యాక్ చేసేందుకు ప్రయత్నించాడు. కువైట్ దివంగత అమిర్ షేక్ సబా అల్ అహ్మద్, లెజిస్లేచర్ని ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ఈ హ్యాకింగ్‌కి నిందితుడు పాల్పడ్డాడు. నిందితుడు ప్రస్తుతం సెంట్రల్ ప్రిజన్లో వున్నాడు. జైలు శిక్ష తర్వాత నిందితుడ్ని డిపోర్ట్ చేస్తారు. అసెంబ్లీ నెట్వర్క్ని నేరపూరితంగా హ్యాక్ చేసినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. రెండు నిమిషాల్లో 7,000కి పైగా వైరస్లు పంపి, లెజిస్లేచర్స్ నెట్వర్క్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. నిందితుడి వివరాలు బయటకు రాలేదు.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్‌షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్‌లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్‌కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్‌లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









