డేటింగ్ పేరుతో దుబాయ్ పైలెట్ కు ఎర..ఇంటికి పిలిపించుకొని నిలువుదోపిడి

- November 07, 2020 , by Maagulf
డేటింగ్ పేరుతో దుబాయ్ పైలెట్ కు ఎర..ఇంటికి పిలిపించుకొని నిలువుదోపిడి

దుబాయ్:ఓ నైజీరియన్ గ్యాంగ్ వలపు వల వేసింది. తీయని మాటలతో దుబాయ్ పైలట్ ను కవ్వించింది. ఆ తర్వాత డేటింగ్ అంటూ ఇంటికి రప్పించి...మూకుమ్మడి దాడి చేసి ఉన్నదంతా దోచుకుంది. ఇదంతా గత జూన్ లో జరిగింది. బాధితుడు తుర్కిష్ కు చెందిన వ్యక్తి. దుబాయ్ లో పైలట్ గా చేస్తున్నాడు. ఓ అమ్మాయి అతనికి వాట్సాప్ లో పరిచయం అయిందని, తానను అమెరికన్ గా పరిచయం చేసుకున్నట్లు బాధితుడు తనను ట్రాప్ చేసిన విధానాన్ని వివరించాడు. వాట్సాప్ లో చాటింగ్ ముదిరింది. అవతల ఉన్నది నిజంగానే అమెరికా అమ్మాయేనని పూర్తిగా నమ్మిన తర్వాత..పైలట్ కు ఆ కిలాడీ లేడీ టీ ఆఫర్ చేసింది. 47 ఏళ్ల వయసులో అమెరికన్ లేడీతో గడపే అవకాశం రావటం నిజంగానే సో లక్కీ అనుకున్నాడు ఆ పైలట్. ఇంటికి వెళ్లి డోర్ నాక్ చేశాడు. ఓ లేడీ వచ్చి డోర్ తీసింది. తనకు వాట్సాప్ లో పరిచయం అయిన అమ్మాయి పేరు చెప్పి..ఆమె ఎక్కడ అని అడిగాడు. లోపల మీ కోసమే ఎదురు చూస్తోంది అంటూ ఇంట్లోకి వెల్కం చెప్పింది ఆ లేడీ. మరో ఆలోచన లేకుండా ఆ పైలట్ ఇంట్లోకి వెళ్లాడు. డోర్ తీసి వెల్కం చెప్పిన ఆ లేడీ...వెంటనే డోర్ వేసేసి లాక్ చేసింది. ఇంట్లో నుంచి తన వాట్సాప్ రాణి వస్తుందని ఆశ పడిన పైలట్ కు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. 8 మంది నైజీరియన్లు ఒక్కసారిగా అతన్ని అటాక్ చేశారు. అందులో నలుగురు మగాళ్లు..నలుగురు ఆడాళ్లు. అతనిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. మొబైల్ లాక్కున్నారు. బట్టలన్ని విప్పేసి టార్చర్ చేశారు. వేడి ఇనుప చువ్వతో కాలుస్తామని బెదిరించి అతని ఏటీఎం కార్డు పిన్ నెంబర్ కనుకున్నారు. ఆ తర్వాత Dh19,454 డ్రా చేసుకొని వెళ్లిపోయారు. వాళ్లంతా వెళ్లిపోయాక ఎలాగోలా తప్పించుకున్న బాధిత పైలట్ జూన్ 4న దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గ్యాంగ్ లోని నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ చేపట్టిన దుబాయ్ కోర్టు దోపిడికి సహాయపడిన వారికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానాతో పాటు దేశ బహిష్కరణ విధించింది. 

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com