భారత్‌లో కొత్తగా 38,074 కరోనా కేసులు

- November 10, 2020 , by Maagulf
భారత్‌లో కొత్తగా 38,074 కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 38,074 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,91,731కి చేరింది. ఇక గత 24 గంటల్లో 42,033 మంది కోలుకున్నారు. గడచిన 24 గంట‌ల సమయంలో 448 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,27,059 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 79,59,406 మంది కోలుకున్నారు. 5,05,265 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 11,96,15,857 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,43,665 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com