నిషేధ జాబితాలో ‘పాయిజన్‌ ఆఫ్‌ రేప్‌’ డ్రగ్‌

- November 10, 2020 , by Maagulf
నిషేధ జాబితాలో ‘పాయిజన్‌ ఆఫ్‌ రేప్‌’ డ్రగ్‌

కువైట్ సిటీ:ఓ నేషనల్‌ గార్డ్‌ మెంబర్‌ ద్వారా దేశంలోకి అక్రమంగా స్మగుల్‌ అయిన డ్రగ్‌ని నిషేధిత జాబితాలో చేర్చినట్లు క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (సిఐడి) వెల్లడించింది. గ్లాస్‌ క్లీనింగ్‌ లిక్విడ్‌ని డ్రగ్‌గా వాడుతున్నారనీ, 1 మిల్లీ లీటర్‌ డ్రగ్‌ని ఒక దినార్‌కి విక్రయిస్తున్నారని సిఐడి పేర్కొంది. నిందితుడి వద్ద నుంచి 3 లీటర్ల డ్రగ్‌ని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ‘గమ్మా డ్రగ్‌’గానూ పిలుస్తారు. ‘పాయిజన్‌ ఆఫ్‌ రేప్‌’గానూ దీన్ని అభివర్ణిస్తారు. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు అధికారులు. యునైటెడ్‌ స్టేట్స్‌లో 1991లో దీన్ని బ్యాన్‌ చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com