దుబాయ్:ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఫేస్ మాస్క్ నుంచి మినహాయింపు
- November 10, 2020
దుబాయ్:కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఫేస్ మాస్క్ తప్పనిసరి నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు దుబాయ్ అధికారులు వెల్లడించారు. ఫేస్ మాస్క్ నుంచి మినహాయింపు పొందాలనుకుంటున్న వారు అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని దుబాయ్ ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. దుబాయ్ పోలీసుల భాగస్వామ్యంతో ఈ డ్రైవ్ చేపట్టామని వివరించారు. ముఖ్యంగా ఫేస్ మాస్క్ ధరించటం వల్ల స్కీన్ అలర్జీ సమస్యను ఎదుర్కుంటున్న వారు, దీర్ఘకాలికంగా సైనటీస్ తో బాధపడుతున్నవారు, అస్తమా వ్యాధిగ్రస్తులు, నోరు, ముక్కు, చెవి సంబంధిత వ్యాధులు ఉన్నవారు మాస్కులు ధరించటం వల్ల ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితులు ఉన్నట్లు మెడికల్ రిపోర్టులు ఉంటే వారికి మాస్కులు తప్పనిసరి నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు అధికారులు వివరించారు. ఫేస్ మాస్క్ రూల్ నుంచి మినహాయింపు పొందాలనుకునే వారు..దుబాయ్ పోలీస్ వెబ్ సైట్ http://www.dxbpermit.gov.aeద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు మెడికల్ రిపోర్టును, ఎమిరాతి ఐడీని తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారిడి అప్లికేషన్ సహేతుకమని భావిస్తే వారికి మినహాయింపు ఇస్తామని, మినహాయింపు పొందిన వారు ఫేస్ మస్కులు ధరించాల్సిన అవసరం లేదని డీహెచ్ఏ వెల్లడించింది. అయితే..ఆరోగ్య సంరక్షణ కోసం పబ్లిక్ ప్రాంతాల్లో ఉండే సమయంలో వీలైనంత వరకు మాస్కులు ధరించటమే అందరికీ శ్రేయస్కరమని డీహెచ్ఏ తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







