ప్రముఖ రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి మృతి
- November 10, 2020
హైదరాబాద్:హీరో వరుణ్ సందేశ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి తండ్రి అంటే తాత గారు అయిన జీడిగుంట రామచంద్రమూర్తి కరోనా కారణంగా కన్ను మూశారు. ఆయన వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. రేడియో నాటకాలు రాయడం, వాటిల్లో నటించడం; కథలు, నాటికలు, నవలలు, సినిమాలకు సంభాషణలు, అనువాద వ్యాసాల రచన… ఇలా అన్నింట్లో తన సత్తా చాటారు జీడిగుంట రామచంద్రమూర్తి.
కేవలం రచనపై ఉన్న ఆసక్తితోనే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని మరీ ఆకాశవాణిలో అడుగుపెట్టి పదవీ విరమణ వరకు అందులోనే ఉండిపోయారాయన. 80 ఏళ్ల వయసులోనూ కథలు రాస్తూ ఆనందంగా జీవనం సాగిస్తున్నారు ఆయన. ఆయనకు ముగ్గురు కొడుకులు. ఇద్దరు కొడుకులు అంటే వరుణ్ తేజ్ తండ్రితో సహా అమెరికాలో ఉంటారు. ఇక మూడో ఆయన జీడిగుంట శ్రీధర్ టీవీ సీరియళ్లతో తెలుగు ఇండస్ట్రీకీ సుపరిచితుడే. ఇక వరుణ్‌సందేశ్ ఆయన పెద్దబ్బాయి కొడుకు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







