వాడిపోయిన పూలతో బిజినెస్.. వాట్ ఎన్ ఐడియా సర్జీ..
- November 10, 2020
పనికొచ్చే ఆలోచనలు చేయరా.. ఎందుకు ఆ పనికిమాలిన ఆలోచనలు.. వాడిపోయిన పూలతో బిజినెస్ అంట.. ఒక్కరోజు చెట్టు మీద ఉంటేనే వడబడినట్లై అటు దేవుడికీ పెట్టరు.. ఇటు తల్లోనూ పెట్టుకోరు.. అలాంటిది వాడి పారేసిన ఆ పూలతో ఏం చేస్తావురా.. అమ్మానాన్నకి తానేం చేద్దామనుకుంటున్నాడో అర్థం కాక అరుపులు.. అవన్నీ లెక్క చేయకుండా చేసి చూపించాడు సక్సెస్ అయ్యాడు ఢిల్లీకి చెందిన అంకిత్ అగర్వాల్.
PHOOL అని తన వెబ్సైట్ వ్యాపార సంస్థకు నామకరణం చేశాడు. దేవాలయాల్లో ప్రతి రోజు అలంకరించే పూలను గంగానదిలో పడేయడం చూసి నది కలుషితమైపోతోందని ఆవేదన చెందాడు.. తన వంతు ప్రయత్నం ఏదైనా చేయాలనుకున్నాడు.. స్నేహితులతో కలిసి దేవాలయాల వద్దకు వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడి వాడి పోయిన పూలను తమకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వీటితో అగరబత్తుల తయారీ ప్రారంభిస్తానని చెప్పాడు ఏం చేస్తావు వీటితో అని అడిగిన ఆలయ అధికారుల ప్రశ్నకు సమాధానంగా.
బిజినెస్ మొదలైంది.. పలువురికి ఉపాధి దొరికింది.. వ్యాపారం పుంజుకుంది. ఫూల్ ద్వారా విక్రయించే వస్తువులు ఏవీ పర్యావరణానికి హాని కలిగించవు. అగర్‌బత్తులతో పాటు ఇన్సెన్స్ కోన్స్, వెర్మికంపోస్ట్ వంటి వాటిని కూడా విక్రయిస్తుంటారు. రూ.290కు పైగా కొనుగోలు చేస్తే ఫ్రీ డెలివరీ సౌకర్యం కూడా ఉంది. ఆర్డర్ చేసిన వారికి దేశవ్యాప్తంగా ఎక్కడికైనా డెలివరీ లభిస్తుంది. ప్రధాన పట్టణాల్లో ఈ సంస్థకు రిటైల్ స్టోర్లు కూడా ఉన్నాయి. భాగ్యనగరంలోని సికింద్రాబాద్‌లో సైతం ఫూల్ స్టోర్ ఉంది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్







