సెలెక్టర్లు కావలెను..BCCI ప్రకటన

- November 11, 2020 , by Maagulf
సెలెక్టర్లు కావలెను..BCCI ప్రకటన

న్యూ ఢిల్లీ:సీనియర్ సెలెక్షన్ కమిటీలో త్వరలో ఖాళీ అవుతున్న సెలెక్టర్లను భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులకు ఈనెల 15 ఆఖరి తేదీ అని ప్రకటనలో పేర్కొంది. కమిటీలోని దేవాంగ్ గాంధీ (ఈస్ట్‌జోన్), శరణ్‌దీప్ సింగ్ (నార్త్‌జోన్), జతిన్ పరాంజన్ (వెస్ట్‌జోన్) ల పదవీ కాలం ఇదివరకే ముగిసినా.. ఆసిన్ పర్యటన కోసం జట్లను ఎంపిక చేసేందుకు పొడిగింపు ఇచ్చింది. జట్ల ఎంపిక పూర్తి కావడంతో ఇక సెలెక్టర్ల భర్తీపై బోర్డు దృష్టిసారించింది. ఇప్పటికే సౌత్‌జోన్ నుంచి ఖాళీ అయిన ఎమ్మెస్కే ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్) స్థానంలో సునీలో జోషి (కర్ణాటక), సెంట్రల్ జోన్‌లో గగన్ ఖోడా స్థానంలో హర్వీందర్ సింగ్‌లను నియమించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com