జెడ్డా సిమిటెరీ ఎటాక్‌లో గాయపడ్డవారిని ప్రిన్స్ మిషాల్ పరామర్శ
- November 12, 2020
జెడ్డా: జెడ్డా గవర్నర్ ప్రిన్స్ మిషాల్ బిన్ మాజెద్, జెడ్డా సిమిటరీ ఎటాక్‌లో గాయపడ్డవారిని పరామర్శించారు. చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న ప్రిన్స్ మిషాల్, వైద్య చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మక్కా రీజియన్ పోలీస్ డైరెక్టర్ మేజర్ జనరల్ ఈద్ అల్ ఒతైబి, పలు గవర్నరేట్లకు చెందిన అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెడ్డాలోని ఓ నాన్ ముస్లిం సిమిటరీలో బాంబు పేలుడు సంభవించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులకు నివాళులర్పించేందుకు పలు విదేశీ ఎంబసీలు చేపట్టిన కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. అందులో ఒకరు గ్రీక్ కాన్సులేట్ మెంబర్ కాగా, మరొకరు సౌదీ సెక్యూరిటీ గార్డ్.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







