కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ ‘బి అవేర్’ వినియోగించండి
- November 17, 2020
బహ్రెయిన్ హెల్త్ అథారిటీస్, పౌరులు అలాగే నివాసితుల్ని కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ ‘బి అవేర్’ని వినియోగించాలని సూచించడం జరుగుతోంది. తమను తాము రక్షించుకోవడంతోపాటు, తమ కుటుంబ సభ్యుల్ని రక్షించుకోవడం అలాగే కరోనా వైరస్ నేపథ్యంలో దేశం చేస్తోన్న ప్రయత్నాలకు తమవంతు సహాయం అందించడంలో భాగంగా ఈ యాప్‌ని వినియోగించాలని అథారిటీస్ కోరుతున్నాయి. ఈ యాప్ ద్వారా ‘కాంటాక్ట్ ట్రేసింగ్’ చాలా సులభతరమవుతుంది. ఎప్పటికప్పుడు కోవిడ్ 19కి సంబంధించిన అప్‌డేట్స్ ఇందులో లభ్యమవుతాయి. యాక్టివ్ కేసులు ఎక్కడ ఎక్కువగా వున్నాయి అనే విషయాన్ని తెలియజేస్తుంది ఈ యాప్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సంబంధిత సమాచారాన్ని ఇందులో పొందుపర్చడం జరుగుతుంది. కాంటాక్ట్ ట్రేసింగ్ కేసుల్ని గుర్తించి, ఆయా వ్యక్తుల్ని అప్రమత్తం చేస్తుంది. పౌరులు అలాగే నివాసితుల వ్యక్తిగత సమాచార గోప్యతను ఈ యాప్ కాపాడుతుంది. ఆండ్రాయిడ్ అలాగే ఐఓఎస్ వేదికలపై ఈ యాప్ ఉచితంగానే అందుబాటులో వుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!







