మోడెర్నా టీకా పనితీరు అద్భుతం: ఆంటోనీ ఫౌసీ
- November 17, 2020
వాషింగ్టన్: కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేడయం కోసం మోడెర్నా రూపొందించిన టీకా ప్రాథమిక ఫలితాలపై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌసీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ టీకా పనితీరు తనను అద్భుతంగా ఆకట్టుకుందని పేర్కొన్నారు. కాగా, టీకా కోసం ఎదురుచూస్తున్న ప్రపంచానికి సోమవారం మోడెర్నా శుభవార్త చెప్పింది. తాము రూపొందించిన టీకా మొదటి విశ్లేషణలో 94.5 శాతం సమర్థతను చూపినట్లు వెల్లడించింది.
మోడెర్నా టీకా పనితీరుతో తాను 70 శాతం నుంచి ఎక్కువలో ఎక్కువ 75 శాతం సంతృప్తి చెందానని ఆంటోనీ ఫౌసీ పేర్కొన్నారు. మన దగ్గర 94.5 శాతం సమర్థతతో పనిచేసే టీకా ఉందనే విషయం అద్భుతంగా ఉందని, ఇది నిజంగా గొప్ప ఫలితమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇంత బాగా పనిచేసే టీకా లభిస్తుందని ఎవరూ ఊహించి ఉండరని అభిప్రాయపడ్డారు. చైనా కరోనా వైరస్ జన్యుక్రమాన్ని అందజేసిన వెంటనే జనవరిలో ఫౌసీ నేతృత్వంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీస్ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, యూఎస్ బయోటెక్ సంస్థతో కలిసి టీకా అభివృద్ధిని చేపట్టింది.
ఈ వ్యాక్సిన్‌లో ఎంఆర్ఎన్ఏ అనే కొత్త సాంకేతికతను ఉపయోగించారు. ఈ సరికొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై తాము ఇప్పటివరకు చాలా విమర్శలు ఎదుర్కొన్నామని ఫౌసీ తెలిపారు. ఇక తాము నిరూపించుకోవాల్సింది ఏమీ లేదని, తాజాగా వెలువడిన ఫలితాలే విమర్శకులకు సమాధానమని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







