డబ్బుంటే ఇదిగో ఇలా..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మాస్క్
- November 17, 2020
ఎన్ 95 మాస్క్ కొనాలంటేనే రేటు వందల్లో ఉందని ఒకసారి పడేసే మాస్కే బెస్ట్.. అయిదు, పది రూపాయల్లో వచ్చేస్తుందని చాలా మంది వాటివైపే మొగ్గు చూపుతున్నారు. కానీ రాజుకి డబ్బులకి కొదవేంటన్నట్లు అమెరికాలో నివసిస్తున్న ఓ చైనా వ్యాపారవేత్త ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మాస్క్‌ని ధరించాలని ఉవ్విళ్లూరాడు. అనుకున్నదే తడవుగా బంగారం వర్తకుడిని పిలిచి మాస్క్ తయారీకి ఆర్డర్ ఇచ్చాడు. మొత్తానికి 4నెలల సమయం తీసుకుని వజ్ర, వైఢూర్యాలు ఉపయోగించి 270 గ్రాముల బరువుండే మాస్క్‌ని తయారు చేసి ఇచ్చారు. దీని ధర 1.5 మిలియన్ డాలర్లు కాగా.. మన కరెన్సీలో చూస్తే రూ.11.2 కోట్లు. ఈ మాస్క్‌పై 3600 నలుపు, తెలుపు రంగు వజ్రాలను పొదిగారు. ఇంకా ఎన్-99 ఫిల్టర్‌ని కూడా అమర్చారు. వైవెల్ జ్యువెలరీ కంపెనీ ఈ మాస్క్‌ని తయారు చేసింది. మాస్క్ తయారీకి ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి లాస్ ఏంజెల్స్‌లో ఉంటున్నారని చెప్పారు.. ఆయన పూర్తి వివరాలు వెల్లడించడానికి జ్యువెలరీ సంస్థ నిరాకరించింది. జెరూసలెం సమీపంలోని నగల తయారీ సంస్థ యజమాని లెవీ మాట్లాడుతూ.. డబ్బున్నా ప్రతిదీ కొనుక్కోలేం. ఖరీదైన కోవిడ్ మాస్క్ ధరిస్తే చుట్టుపక్కల వారి దృష్టిని ఆకర్షించవచ్చనేది కస్టమర్ అభిమతమై ఉంటుందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇంత ఖరీదైన మాస్క్ ధరించడం సబబు కాదు.. కానీ కోవిడ్ కష్టకాలంలో మా ఉద్యోగులకు మాస్క్ తయారీ కోసం నాలుగు నెలల పాటు పని కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు అని లెవీ పేర్కొన్నారు. 25 మంది నిపుణులైన పనివాళ్లు ఈ మాస్క్ తయారీలో పాలుపంచుకున్నారని లెవీ ఆనందం వ్యక్తం చేశారు.
💎 Is this the most expensive mask in the world?@Yvel_Jewelry in Israel is making a $1.5 million #Covid19 face mask, complete with 18-karat white gold and 3,600 diamonds pic.twitter.com/Pciz7wILUX
— Bloomberg Quicktake (@Quicktake) August 16, 2020
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు