ఛాత్ పూజలకు హైకోర్టు బ్రేకులు
- November 18, 2020
న్యూఢిల్లీ: కోవిడ్ కారణంగా చెరువులు, నదీ ప్రాంతాల వంటి బహిరంగ ప్రదేశాల్లో ఛాత్ పూజలు జరపరాదంటూ ఢిల్లీ ప్రభుత్వం విధించిన నిషేధంపై జోక్యం చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు నిరాకరించింది. ఈనెల 20న బహిరంగ ప్రదేశాల్లో ఛాత్ పూజలకు అనుమతించేది లేదంటూ ఢిల్లీ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ (డీడీఎంఏ) చైర్మన్ ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జనమంతా ఒక చోట గుమిగూడటానికి అనుమతించడం వల్ల ఇన్‌ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తుందని, డీడీఎంసీ ఉత్తర్వును సవాలు చేస్తూ వేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని భావిస్తూ కొట్టివేస్తున్నట్టు న్యాయమూర్తులు హైమ కోహ్లి, సుబ్రమణియం ప్రసాద్‌తో కూడిన బెంచ్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్‌లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్‌లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్‌పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ పోర్ట్‌ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







