మోదీ-బైడెన్...మాటామంతి
- November 18, 2020
భారత ప్రధాని నరేంద్రమోదీ.. తొలిసారిగా అమెరికా నూతన అధ్యక్షుడిగా విజయం సాధించిన జో బైడెన్‌కు ఫోన్ చేశారు. మంగళవారం రాత్రి ఆయనతో సంభాషించారు. బైడెన్ అగ్రరాజ్యాధినేతగా గెలుపొందిన తర్వాత ప్రధాని మోదీ ఫోన్ చేయడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఆయనను అభినందించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డోనాల్డ్ ట్రంప్ తరపున భారత ప్రధాని మోదీ ఆ దేశంలో ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ట్రంప్ తన పదవీ కాలంలో ప్రధాని మోదీతో ఏంతో సన్నిహితంగా మెలిగారు. ట్రంప్ కూడా ప్రధాని ఆహ్వానం మేరకు భారత్ లో పర్యటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించడంతో పలు దేశాల అధ్యక్షులు ఆయనకు ఫోన్ చేసి అభినందించినా మోదీ మాత్రం ఫోన్ చేయలేదు. ఎట్టకేలకు మోదీ మంగళవారం రాత్రి బైడెన్ కి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అగ్ర నేతల మధ్య ఇండో-ఆసియా పసిఫిక్, క్లైమెట్ ఛేంజ్ వంటి కీలకాంశాలపై సుదీర్ఘంగా ఫోన్ సంభాషణ సాగినట్టు సమాచారం. ప్రధాని మోదీ, జో బైడెన్ కు ఫోన్ చేసి మాట్లాడినట్లు ప్రధాని కార్యాలయం అధికారులు, అమెరికాలో భారత రాయబారి తరణ్‌జింత్ సింగ్ సంధు వేర్వేరుగా వెల్లడించారు.
మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో నరేంద్ర మోదీ ఆయనకు ఫోన్ చేశారు. కొద్దిసేపటి తరువాత ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ కూడా వెల్లడించారు.
ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్‌పై కూడా వీళ్లిద్దరూ సంభాషించుకున్నట్టు సమాచారం. భారత్-అమెరికా మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై తాము చిత్తశుద్ధితో ఉన్నామని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా జో బైడెన్ కు హామీ ఇచ్చారని అమెరికాలోని భారత రాయభారి తరణ్‌జింత్ సింగ్ సంధు వెల్లడించారు.
2014లో నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో జో బైడెన్ ఆ దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్నారని గుర్తు చేశారు. ఉపాధ్యక్షుడి హోదాలో జో బైడెన్ నరేంద్ర మోదీ గౌరవార్థం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారని చెప్పారు. బైడెన్ నేతృత్వంలో భారత్, అమెరికా సంబంధాలు మరింత మెరుగుపడతాయని తరుణ్జింత్సింగ్ చెప్పారు.
భారత సంతతికి చెందిన కమలాహ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా ఉండటం కూడా భారత్‌కు మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక, రాజకీయాల పరంగా బంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉన్నదని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్‌లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్‌లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్‌పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ పోర్ట్‌ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







