యూఏఈలో ఇండియన్ కాన్సులర్ సర్వీసులు చవక
- February 17, 2016
పాస్‌పోర్ట్ మరియు కాన్సులర్ సర్వీసులు యూఏఈలోని భారత వలసదారులకు చవక కానున్నాయి. అబుదాబీలో ఇండియన్ మిషన్ ద్వారా ఎంపిక కానున్న కొత్త సర్వీస్ ప్రొవైడర్ ద్వారా తక్కువ ఖర్చుతో పలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎంబసీ ఇప్పటికే దీనికి సంబంధించి ప్రపోజల్స్ కోసం ఆహ్వానాలు పంపింది. ప్రస్తుతం ఈ సర్వీసులు అందిస్తున్న బిఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ ముగియడంతో కొత్త సర్వీస్ ప్రొవైడర్ ఎంపిక జరగనుంది. ప్రస్తుతం ఇది బిడ్డింగ్ దశలోఉంది. జనవరి 31తో వాస్తవానికి బిడ్ గడువు ముగియగా, 20 కంపెనీలు ముందుకొచ్చాయి. అయితే ఇంకాస్త గడువు పొడిగించమనే విజ్ఞప్తులు రావడంతో, ఫిబ్రవరి 29 వరకు అవకాశమిచ్చారు. తక్కువ ధరకు కోట్ చేసిన కంపెనీలకు పాస్‌పోర్ట్, కాన్సులర్ సర్వీసులు అందించే ఛాన్స్ దక్కనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







