పాకిస్తాన్కు యూఏఈ షాక్
- November 19, 2020
ఇస్లామాబాద్ : పాకిస్తాన్కు యూనైటేడ్ అరబ్ ఎమిరేట్స్ ఊహించని షాక్ ఇచ్చింది. పాక్ నుంచి వస్తున్న సందర్శకులకు వీసాలను రద్దు చేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది. పాక్తో పాటు మరో 11 దేశాల వీసాలను సైతం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్థానిక ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తీసుకున్నట్లు తెలిపింది. ఇతర దేశాల నుంచి ప్రతి ఏటా విదేశీయులు యూఏఈకి ప్రయాణాలు కొనసాగిస్తారు.
ఈ క్రమంలోనే వారి వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది ఆ దేశ వైద్య అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. వైద్యులు వినతిని పరిశీలించిన ప్రభుత్వం.. పాకిస్తాన్తో పాటు 11 దేశాల వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని పలు దేశాల ప్రభుత్వాలు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రాన్స్తో పాటు, లండన్, ప్రాన్స్తో పాటు, లండన్ ఇప్పటికే రెండో విడత లాక్డౌన్ విధించాయి. మరొకొన్ని దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్







