సిబ్బందికి కరోనా.. క్వారంటైన్‌లో సల్మాన్ ఖాన్‌

- November 19, 2020 , by Maagulf
సిబ్బందికి కరోనా.. క్వారంటైన్‌లో సల్మాన్ ఖాన్‌

ముంబై: బాలీవుడ్ అగ్రకథానాయకుడు సల్మాన్ ఖాన్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. తన వ్యక్తిగత డ్రైవర్ అశోక్‌తోపాటు ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో సల్మాన్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా చైన్‌ను విచ్ఛిన్నం చేయడానికి తనతోపాటు కుటుంబ సభ్యులంతా 14 రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు. కరోనా బారిన పడిన తన సిబ్బందికి సల్మాన్ ముంబైలోని దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. కాగా, తన తల్లిదండ్రలు సలీంఖాన్‌, సల్మా ఖాన్‌ల వివాహ వార్షికోత్సవ వేడుకలను కరోనా వల్ల రద్దు చేశారు. సల్మాన్‌కు ప్రస్తుతం ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తెలిసింది. త్వరలోనే ఆయన కరోనా పరీక్షలు చేయించుకోనున్నారు. 

ఇదిలా ఉంచితే హిందీ ప్రేక్షకుల్ని అలరిస్తున్న బిగ్‌బాస్‌-14 రియాల్టీ షోకు సల్మాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  దాంతో హిందీ బిగ్‌బాస్‌ హోస్టింగ్‌ వ్యవహారం సందిగ్థంలో పడింది. 14 రోజుల పాటు ఇంటికే పరిమితం కావాలని నిర్ణయించుకున్న సల్మాన్‌ ఖాన్‌.. తాను మళ్లీ తిరిగి పాల్గొనే వరకూ వేరే వాళ్లకు బిగ్‌బాస్‌-14 హోస్ట్ బాధ్యతలను అప్పగించే అవకాశాలు కనబడుతున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com