దుబాయ్ రైడ్ కు అంతా రెడీ..రేపు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
- November 19, 2020
దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో భాగంగా దుబాయ్ మరో ఈవెంట్ సిద్ధమైంది. రేపు(శుక్రవారం) నిర్వహించబోయే దుబాయ్ రైడ్ సైక్లింగ్ ను సజావుగా నిర్వహించేందుకు నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు దుబాయ్ ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు. సైకిల్ రైడింగ్ జరిగే రహదారుల్లో ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని వాహనదారులకు సూచించింది. సైకిల్ రైడింగ్ కొనసాగే షేక్ జాయెద్ రోడ్ మూసివేయనున్నట్లు తెలిపిన ఆర్టీఏ..వాహనదారులు అల్ ఖైల్ రోడ్డును ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవాలని తెలిపారు. అలాగే లోయర్ ఫైనాన్షియల్ సెంటర్ రోడ్డును మూసి ప్రత్యామ్నాయంగా అప్పర్ ఫైనాన్సియల్ రోడ్డును అందుబాటులో తీసుకురానున్నారు. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ రోడ్డులోనూ వాహనాలను అనుమతించరు..అందుకు ప్రత్యామ్నాయంగా బుర్జ్ ఖలీఫా రోడ్ ను వాహనదారులు వినియోగించుకోవాల్సి ఉంటుంది. దుబాయ్ రైడ్ లో పాల్గొనే వారి కోసం అప్పర్ ఫైనాన్షియల్ సెంటర్ రోడ్ ద్వారా దుబాయ్ మాల్, జబీల్ పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ చేసుకోవచ్చు. ముష్తాక్బాల్, జబీల్ 2 స్ట్రీట్స్ ద్వారా వచ్చే వాహనాలకు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు