లులు డ్రా: 400 మందికి 25,000 బహ్రెయినీ దినార్స్ బహుమతి
- November 20, 2020
మనామా:లులు హైపర్ మార్కెట్ నిర్వహించిన ‘షాప్ అండ్ విన్’ నాలుగవ ర్యాఫిల్ డ్రా మంగళవారం జరిగింది. హిద్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 400 మంది లక్కీ షాపర్స్ తమ ఇంటికి 25,000 బహ్రెయినీ దినార్స్ పొందుతున్నారు లులు షాపింగ్ గిఫ్ట్ కార్డ్ ద్వారా. విజేతలు, లులు హైపర్ మార్కెట్ కస్టమర్ సర్వీస్ సెంటర్ (హిద్)ని సంప్రదించి తమ బహుమతల్ని దక్కించుకోవచ్చు. కాగా, 100 బహ్రెయినీ దినార్స్ షాపింగ్ కార్డ్ విజేతలు 150 మంది వున్నారు. 50 బహ్రెయినీ దినార్స్ విలువైన షాపింగ్ కార్డ్ విజేతలు 150 మంది వున్నారు. 25 బహ్రెయినీ దినార్స్ గిఫ్ట్ కార్డ్ విజేతలు 100 మంది. ఇప్పటివరకు మొత్తం 1600 మంది షాపర్స్ లులు గిఫ్ట్ కార్డుల్ని సొంతం చేసుకున్నారు. కొతమతం 100,000 బహ్రెయినీ దినార్స్ విలువైన గిఫ్ట్ కార్డ్స్ ఇప్పటివరకు విజేతలు దక్కించుకున్నారు. కాగా, మొత్తం 150,000 బహ్రెయినీ దినార్స్ విలువైన గిఫ్ట్ కార్డుల్ని గెల్చుకునే అవకాశాన్ని ఈ ఏడాది చివరి వరకు కల్పించింది లులు సంస్థ. మరో రెండు ర్యాఫిల్ డ్రాలు నిర్వహించాల్సి వుంది. 5 బహ్రెయినీ దినార్స్‌ని లులు హైపర్ మార్కెట్స్‌లో వెచ్చిస్తే, వారికి ర్యాఫిల్ డ్రాలో పాల్గొనే అవకాశం దక్కుతుంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్‌లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్‌లు ప్రారంభం..
- గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు బిగ్‌షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్‌లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం







