ఢిల్లీలో కాలుష్యం..సోనియాకు వైద్య నిపుణుల సలహా
- November 20, 2020
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కొంతకాలంగా ఛాతి సంబంధ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి పెరిపోయింది. దీంతో స్థానికులు శ్వాసకోశ, గొంతు సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోనియా సైతం కొద్ది రోజుల పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్తారని పార్టీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. వైద్యుల సూచనల మేరకు సోనియా గోవా లేదా చెన్నైకి వెళ్లతారని, కొంతకాలం అక్కడే ఉంటారని వెల్లడించాయి. సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక కూడా వెళ్లనున్నారని సమాచారం.
కాగా, ఛాతీలో ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న సోనియా జూలై 30న ఆమె గంగారాం హాస్పిటల్ లో చికిత్సను కూడా పొందారు. ఆపై సెప్టెంబర్ లో విదేశాలకు వెళ్లి వైద్య పరీక్షలు కూడా చేయించుకుని వచ్చారు. ఇక ఢిల్లీలో పెరిగిన కాలుష్యం కారణంగా సోనియా గాంధీకి ఉబ్బసం సోకే అవకాశాలు అధికమని, ఆపై ఛాతీ నొప్పి తీవ్రతరం కావచ్చని వైద్యులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







