ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- June 23, 2026
దోహా: ఖతార్ రైల్వేస్ కంపెనీ (ఖతార్ రైల్) లుసైల్ ట్రామ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. నెట్‌వర్క్ అంతటా ముఖ్యమైన అభివృద్ధి పనులను చేయడానికి వీలుగా జూన్ 26నుండి జూలై 5 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణీకుల సేవలను మెరుగుపరచడానికి మరియు ట్రామ్ నెట్‌వర్క్ పనితీరును మెరుగుపరచడానికి ఖతార్ రైల్ చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా, రవాణా మంత్రిత్వ శాఖ సమన్వయంతో ట్రామ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతోందన్నారు.
సేవలు నిలిపివేసిన సమయంలో ప్రయాణీకులకు సేవలు నిరంతరాయంగా కొనసాగేలా లెగ్తైఫియా స్టేషన్ నుండి తర్ఫత్ - సౌత్ స్టేషన్ వరకు ప్రత్యామ్నాయ బస్సు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే, ప్రస్తుతం ఉన్న మెట్రోఎక్స్‌ప్రెస్ మరియు మెట్రోలింక్ సేవలు, కొత్తగా ప్రారంభించిన మెట్రోలింక్ రూట్ M154తో సహా ఈ ప్రాంతాన్ని కవర్ చేయడానికి పనిచేస్తాయని పేర్కొన్నది.
వీటితోపాటు ప్రత్యామ్నాయ బస్సు మార్గాలు, సమీప బస్ స్టాప్ స్థానాలు మరియు సేవల ఫ్రీక్వెన్సీ గురించి తెలుసుకోవడానికి స్టేషన్లలో ఏర్పాటు చేసిన గైడ్ లైన్స్ మ్యాప్ లను చూడాలని, అలాగే తాజా సమాచారం కోసం మెట్రో మరియు ట్రామ్ సోషల్ మీడియా ఛానెల్‌లను ఫాలో కావాలని మరియు కాల్ సెంటర్ 105ను సంప్రదించాలని వినియోగదారులకు ఖతార్ రైల్ సూచించింది.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







