పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- June 23, 2026
రియాద్: పబ్లిక్ పార్కులలో అనేక వాణిజ్య కార్యకలాపాలను అనుమతించాలని సౌదీ మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ నిర్ణయించాయి. 5,000 చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న పార్కులలో పురుషులు మరియు మహిళల కోసం జిమ్ లు మరియు స్పోర్ట్స్ సెంటర్లు,ఎంటర్ టైన్ మెంట్ కేంద్రాలు, శిశు సంరక్షణ సౌకర్యాలు, నివాసేతర వృద్ధుల కేంద్రాలు మరియు వికలాంగుల కోసం పగటిపూట సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు.మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనలను ఇస్తిలా పబ్లిక్ సర్వే ప్లాట్‌ఫామ్‌లో ప్రచురించింది.
అలాగే 1,500 చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న పార్కులలో తాజా మరియు నిల్వ ఉంచిన పండ్లు, కూరగాయల చిల్లర అమ్మకాలను, అలాగే హైడ్రోపోనిక్ పద్ధతిలో కూరగాయల ఉత్పత్తిని అనుమతించాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. 1,200 చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న పార్కులలో కేఫ్‌లు, ఐస్ క్రీమ్ దుకాణాలు, తాజా జ్యూస్‌లు అందించే అవుట్‌లెట్‌లు, ఇంకా పూల దుకాణాలను ఏర్పాటు చేయడానికి అనుమతించారు. కాగా, భవనాలు మొత్తం పార్కు విస్తీర్ణంలో 25 శాతానికి మించకూడదని నిబంధన పెట్టారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







