SBIలో అప్రెంటిస్ పోస్టులు..
- November 20, 2020
భారత దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 10 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8500 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపిక ప్రక్రియ రెండు విధాలుగా ఉంటుంది. మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. అంటే అభ్యర్థులకు స్థానిక భాషలపై పట్టు ఉండాలి. మూడేండ్ల కాలపరిమితికి అప్రెంటిస్ను నియమిస్తుంది. అప్రెంటిస్ కాలంలో మొదటి ఏడాది రూ.15 వేలు, రెండో ఏడాది రూ.16,500, మూడో ఏడాది రూ.19 వేలు స్టయిఫండ్గా చెల్లిస్తారు. శిక్షణ అనంతరం వారికి సర్టిఫికెట్ అందిస్తారు. దీనిని ఎస్బీఐతో పాటు ఇతర ప్రైవేట్ బ్యాంకులు నియామకాల సందర్భంగా పరిగణనలోకి తీసుకుంటారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు