దుబాయ్ నుండి హైదరాబాద్, జైపూర్‌కి డైరెక్ట్ స్పైస్‌జెట్
- February 17, 2016
దుబాయ్ నుంచి హైదరాబాద్, జైపూర్‌లకు డైరెక్ట్ విమానాల్ని స్పైస్‌జెట్ సంస్థ ప్రారంభించింది. అలాగే, జైపూర్ నుంచి దుబాయ్‌కి వచ్చిన తొలి డైరెక్ట్ స్పైస్‌జెట్ విమానానికి గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. ప్రైవేటు రంగంలో దుబాయ్ నుంచి హైదరాబాద్, జైపూర్‌లకు తొలి డైరెక్ట్ విమానాన్ని నడిపిన సంస్థగా స్పైస్‌జెట్ రికార్డులకెక్కింది. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వైస్ కాన్సుల్ విపున్ నారులా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా - ఇండియా టూరిజం రీజనల్ డైరెక్టర్ మనాస్ రంజన్ పట్నాయక్, కంట్రీ హెడ్ ఫర్ స్పైస్‌జెట్ వినయ్ నంబియార్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐఆర్.వి. రావు, అసిస్టెంట్ డైరెక్టర్ యూఏఈ - ఇండియా టూరిజంతోపాటు, దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ సీనియర్ అధికారులు, తెలుగు కమ్యూనిటీ నుంచి కిషోర్ బాబు దువ్వూరు(మానేజింగ్ డైరెక్టర్,జజీరా ఎమిరేట్స్ పవర్),శ్రీకాంత్ చిత్తర్వు(మాగల్ఫ్) యూఏఈ నుంచి ప్రముఖ ట్రావెల్ ఏజెంట్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.విపుల్ నారులా, హైదరాబాద్‌కి పయనమైన విమానానికి ఫ్లాగింగ్ ఆఫ్ చేయడంతో కార్యక్రమం ముగిసింది. జైపూర్ నుంచి దుబాయ్‌కి వచ్చిన తొలి డైరెక్ట్ విమానానికి వాటర్ కేనన్‌లతో సెల్యూట్ చేసింది దుబాయ్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ. అనంతరం కేక్ కటింగ్ చేశారు. సోమ, శనివారాలు మినహా అన్ని రోజుల్లో దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి డైరెక్ట్ విమానాల్ని నడపనుంది. బడ్జెట్ విమాన సంస్థగా ప్రయాణీకుల మన్ననలు అందుకుంటున్న స్పైస్‌జెట్ రానున్న రోజుల్లో ఇంకా గొప్ప ప్రయాణ అనుభూతిని సామాన్య ప్రయాణీకులకు అందించనుందని సంస్థ ప్రతినిథులు వెల్లడించారు. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, పూణె, కొచ్చి, మధురై, అమృత్‌సర్, కోజికోడ్, జైపూర్, హైదరాబాద్ నగరాల నుంచి డైరెక్ట్ విమానాల్ని స్పైస్‌జెట్ నడుపుతున్నట్లయ్యింది తాజా సర్వీసులతో కలిపి. స్పైస్‌జెట్ ఇండియాలో నెంబర్ 2 బడ్జెట్ ఎయిర్‌లైన్. 40 ప్రాంతాలకు రోజూ 293 విమాన సర్వీసుల్ని నడుపుతోంది. ఇందులో 34 డొమెస్టిక్, 6 ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ ఉన్నాయి. 26 బోయింగ్ 737 ఎన్‌జి మరియు 2 ఎయిర్‌బస్ ఎ320 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 14 బాంబార్డియర్ క్యు 400 విమానాలను కలిగి ఉంది స్పైస్‌జెట్. స్పైస్ మాక్స్‌తో అత్యంత విశాలమైన ఎకానమీ క్లాస్ సీటింగ్‌తో ఇండియా, ఇంటర్నేషనల్ ప్రయాణీకులకు సేవలు అందిస్తుంది.

తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







