భారత్‌లో కొత్తగా 46,232 కరోనా కేసులు
- November 21, 2020
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 46,232 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,50,598 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 49,715 మంది కోలుకున్నారు. గడచిన 24 గంటల సమయంలో 564 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,32,726 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 84,78,124 మంది కోలుకున్నారు. 4,39,747 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 13,06,57,808 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,66,022 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









