హద్దు దాటిన కాంట్రాక్టర్లు, కంపెనీలకు కువైట్ షాక్..
- November 21, 2020
కువైట్ సిటీ:నిబంధనలు ఉల్లంఘించిన కాంట్రాక్టర్లకు, కంపెనీలకు కువైట్ ప్రభుత్వం షాకిచ్చింది. వివిధ పనులు, ప్రాజెక్టుల కోసం ఆయా కాంట్రాక్టర్లు, కంపెనీలు ప్రభుత్వం దగ్గర గ్యారెంటీగా పెట్టిన దాదాపు 90 మిలియన్ల కువైట్ దినార్లను పూర్తిగా స్వాధీనం చేసుకొని వాటిని ఎన్ క్యాష్ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ కాంట్రాక్టర్లు, కంపెనీలకు తమ మంత్రిత్వ శాఖ నుంచి పేమెంట్లు వెళ్లాల్సి ఉంటే....గ్యారంటీలను ఎన్ క్యాష్ చేసుకునే బదులు ఆ బకాయిల చెల్లింపుల్లో కోత విధించనున్నట్లు పబ్లిక్ వర్క్స్ మినిస్ట్రి స్పష్టం చేసింది. గత ఆర్ధిక సంవత్సరంలో పబ్లిక్ వర్క్స్ పరిధిలో వివిధ ప్రాజెక్టులు చేపట్టిన కాంట్రాక్టర్లు, పలు ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టిన కంపెనీలు...తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోవటంతో గతంలోనే పలు మార్లు నోటీసులు పంపించింది. లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది. ఇక ఇప్పుడు ఆయా కాంట్రాక్టర్లు, కంపెనీలకు చెందిన 90 మిలియన్ల దినార్లను ఎన్ క్యాష్ చేసుకోవాలని నిర్ణయించింది. ఇదిలాఉంటే..2021-22 ఆర్ధిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను రూపొందించే పనిలో ఉంది కువైట్ ప్రభుత్వం. కేవలం మినిస్ట్రి ఆధ్వర్యంలో చేపట్టే పలు ప్రాజెక్టులకు దాదాపు బిలియన్ దినార్లను కేటాయించేలా కసరత్తు చేస్తోంది.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









