నాగచైతన్య కథానాయకుడుగా కొత్త చిత్రం

- February 17, 2016 , by Maagulf
నాగచైతన్య కథానాయకుడుగా కొత్త చిత్రం

కార్తికేయ చిత్రంతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన చందూ మొండేటి ప్రస్తుతం నాగచైతన్య కథానాయకుడుగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది నాగచైతన్యకు 12వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదట. అయితే టైటిల్‌ ఖరారు చేసి శుక్రవారం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేస్తామని చిత్ర బృందం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం నాగచైతన్య, గౌతమ్‌ మేనన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'సాహసమే శ్వాసగా సాగిపో' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అంతేకాదు గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వంలోనే మరో చిత్రానికి కూడా నాగచైతన్య పచ్చజెండా వూపిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com