‘నివర్’ తుపాను..ఏపి, తెలంగాణ, తమిళనాడు లకు ముప్పు
- November 23, 2020
హైదరాబాద్: ఏపి, తెలంగాణలో, తమిళనాడు రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా, రేపు తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ తుపానుకు ఇరాన్ దేశం సూచించిన ‘నివర్’ అని పేరుపెట్టింది. నివర్ ఎల్లుండి తమిళనాడు, పుదుచ్చేరి తీరంలోని కరైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి, ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో ఇప్పటికే వర్ష ప్రభావం ఉందని, రాయలసీమలో రేపటి నుంచి, ఎల్లుండి నుంచి తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాల వెంబడి గంటకు 45 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు, అరేబియా సముద్రంలో ఇప్పటికే ఏర్పడిన ‘గతి’ తుపాను కొనసాగుతోంది. అయితే, ఇది పశ్చిమ తీరానికి దూరంగా ఉన్నప్పటికీ, వర్షం పడే అవకాశం మాత్రం ఉందని చెబుతున్నారు.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్‌లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









