ఇజ్రాయోల్ ప్రధాని సౌదీలో రహస్య పర్యటన!
- November 23, 2020
జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఆదివారం రహస్యంగా సౌదీలో పర్యటించారు. ఈ విషయాన్ని సోమవారం ఇజ్రాయెల్‌కు చెందిన కాన్ పబ్లిక్ రేడియో, ఆర్మీ రేడియో వెల్లడించాయి. పర్యటనలో నెతన్యాహు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోలతో సమావేశమయ్యారు. అయితే, సౌదీ పర్యటనకు సంబంధించి నెతన్యాహు కార్యాలయంగానీ, జెరూసలెంలోని అమెరికా రాయబార కార్యాలయంగానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, ఈ మూడు దేశాలకు సంబంధించిన కీలక నేతలు రహస్యంగా సమావేశమై ఏ విషయంపై చర్చించారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







