గ్రేటర్ హైదరాబాద్‌లో 1,122 మంది అభ్యర్థులు…
- November 23, 2020
హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్‌లో పోరు రసవత్తరంగా సాగుతోంది. నిన్నటి వరకు అన్ని పార్టీ ఆఫీసుల ముందు బీ ఫార్మ్‌ల కోసం కుస్తీ పట్టిన నేతలకు.. ఆ అవకాశాలు కూడా ముగిసాయి. తాజాగా గ్రేటర్‌లో 150 వార్డుల్లో మొత్తం 1,122 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ మాత్రమే పోటీ చేస్తోందని ప్రకటించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ తెలిపారు. గ్రేటర్‌లోని మొత్తం 150 స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీగా టీఆర్ఎస్ పార్టీ నిలిచింది.
ఎన్నికలు జరుగుతున్న అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను పోటీకి నిలిపింది. నవాబ్‌సాహెబ్ కుంట డివిజన్లో తప్ప 149 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను బరిలో దించింది. కాంగ్రెస్ 146 స్థానాలు, ఎంఐఎం 51 స్థానాలు, టీడీపీ 106 స్థానాలు, సీపీఐ 17 స్థానాలు, సీపీఎం 12 డివిజన్లలో అభ్యర్థులు రంగంలోకి దింపింది.
మరో 76 మంది వివిధ గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులు 415 మంది కూడా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక అత్యధికంగా జంగ్గంమెట్ డివిజన్లో 20 మంది అభ్యర్థులు తలపడున్నారు. అత్యల్పంగా 5 డివిజన్లలో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉప్పల్, బార్కస్, నవాబ్ సాహెబ్‌కుంట, టోలిచౌకి, జీడిమెట్లలో ముగ్గురేసి అభ్యర్థులు పోటీలో కొనసాగుతున్నారు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







