షార్జా లో మహిళలకు ఓ ప్రత్యేక బీచ్

- February 17, 2016 , by Maagulf
షార్జా లో మహిళలకు ఓ ప్రత్యేక బీచ్

షార్జా లోని  దిబ్బ అల్ హిష్  ప్రాంతంలో మహిళలకు మాత్రమె ప్రత్యేకంగా ఒక బీచ్ ఉండే విధంగా రూపొందించ నున్నారని అరబ్ ఎమరేట్స్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది.సుప్రేం కౌన్సిల్ సభ్యులు , షార్జా పాలకుడు డాక్టర్ షేఖ్  సుల్తాన్ బిన్ మొహమ్మద్ కసిమి మంగళవారం దిబ్బ అల్ హిష్ లోని పలు ప్రాజెక్ట్ ల తనిఖీ , కీలక సేవల పర్యవెక్షణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల కోసం ఒక  ప్రత్యేక బీచ్ ఉండే విధంగా నిర్మాణం జరగాలని కోరారు. అదేవిధంగా ఒక వారసత్వ గ్రామాన్ని ఏర్పాటు చేసి, షార్జా హెరిటేజ్ ఇన్స్టిట్యూట్ పర్యవేక్షణలో అది కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశించారు. మహిళల కోసం ఒక ప్రత్యేక  బీచ్ తో పాటు పర్యాటక ప్రయోజనాల కోసం ఒక ఆక్వేరియంను సైతం ఈ ప్రాంతంలో నిర్మించాలని షార్జా పాలకుడు డాక్టర్ షేఖ్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ కసిమి తన పర్యటనలో తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com