ప్రధాని చొరవతో బహ్రెయిన్ విమానాశ్రాయ విస్తరణ కార్యక్రమం
- February 17, 2016
బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రాయ విస్తరణ కార్యక్రమం గురువారం ప్రారంభించనున్నారు. రవాణా మరియు టెలి కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ నిర్వహణలో బహ్రెయిన్ ప్రధాని, గౌరవనీయ యువరాజు ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా పోషణలో విమానాశ్రాయ విస్తరణ పనులు జరగనున్నాయి. గత 20 ఏళ్ళకాలంలో బహరిన్ రాజ్యంలో ఇదే అతి పెద్ద విమానయాన అవస్తాపక ప్రణాళిక. ప్రస్తుతం బహరిన్ విమానాశ్రాయ విస్తరణ కార్యక్రమం పూర్తికాబడితే, ఇక్కడనుంచి ఏడాదికి 14 లక్షల మంది విమాన ప్రయాణికులను అనుమతివ్వనుంది. ఇది బహరిన్ రాజ్యంలో ఎంతో వ్యూహాత్మక స్థానం. అలాగే, విమానయాన రంగంలో ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో సంఘటితం అయ్యేందుకు సహాయం చేస్తుంది. ఈ విస్తరణ చర్యల్లో 201,467 చదరపు మీటర్ల ప్రయాణికుల గమ్యస్థానాల అంచు, నిష్క్రమణ మందిరం , తనిఖీ చేసే విభాగాలు , పాస్ పోర్ట్ నియంత్రణా కేంద్రాలు మరియు 28 భద్రతాదారులు, డ్యూటీ ఫ్రీ , రవాణా సరుకులను అందించే నిష్క్రమణ ద్వారాలు, విమానంలో వచ్చినవారికి పాస్ పోర్ట్ నియంత్రణ కేంద్రాలు, ఈ - ద్వారాలు , బెల్ట్ ద్వారా నడపబడే బ్యాగులను ప్రయాణికులు చేజిక్కించుకొనే ప్రాంతాలు మరియు కార్లను పార్కింగ్ చేసుకొనే ప్రదేశాలు ఉన్నాయి. ఇక బెహరినీయులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ రవాణా దుకాణాలు ప్రయాణికుల టెర్మినల్‌లో ఏర్పాటు కానున్నాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్–2026..!!
- డిసెంబర్ 11 నుంచి అబుదాబిలో ‘లివా ఫెస్టివల్’..!
- విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఇవ్వండి..పేరెంట్స్ కు PHCC సూచన..!!
- కువైట్‌లో వాహన బీమా విధానంలో కీలక మార్పులు..!
- బహ్రెయిన్‌లో కిడ్నాప్ కేసు.. ఇద్దరు కంపెనీ అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీ అరేబియాపై హౌతీల దాడి.. ఆరుగురికి గాయాలు..!!
- హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: జీసీసీ దేశాల డిమాండ్
- బహ్రెయిన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!!







