కేబినెట్‌లో కొందరి పేర్లను వెల్లడించిన జో బైడెన్
- November 24, 2020
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ పలువురిని తన క్యాబినెట్ సహచరులుగా ఎంచుకున్నారు. తనకు సుదీర్ఘకాలంగా విదేశీ విధాన సలహాదారుగా ఉన్న ఆంటోనీ బ్లింకెన్ ను విదేశాంగ శాఖ మంత్రిగా నియమించుకున్నారు. యూఎస్ మాజీ చీఫ్ డిప్లొమాట్ జాన్ కెర్రీని ప్రత్యేక వాతావరణ విభాగానికి అధిపతిని చేశారు. క్యూబాలో జన్మించి, బైడెన్ కు ఎంతోకాలంగా న్యాయ సేవలను అందిస్తున్న అలెజాండ్రో మాయోర్కస్ ను ఇమిగ్రేషన్ సేవలను నిర్వహించే హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి మంత్రిని చేశారు.
సీఐఏ మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఆర్విల్ హైన్స్ ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా నియమిస్తున్నట్టు తెలిపారు. ఈ పదవికి అమెరికా చరిత్రలో ఓ మహిళను ఎంచుకోవడం ఇదే తొలిసారి. ఇక యునైటెడ్ నేషన్స్ లో అమెరికా ప్రతినిధిగా లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్ ను నియమించారు. బైడెన్ అమెరికాకు ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో సెక్యూరిటీ సేవలను అందించిన జాక్ సుల్లివాన్ ను వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ గా నియమించారు.
కాగా, వీరంతా 2009 నుంచి 2017 మధ్య ఒబామా బైడెన్ పాలన జరుగుతున్న కాలంలో వారి వారి రంగాల్లో అపారమైన అనుభవాన్ని కలిగున్న సీనియర్లు కావడం గమనార్హం.
తాజా వార్తలు
- భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డు
- అనధికార అబార్షన్ ప్రమోటింగ్..ప్రవాసికి ఆరు నెలల జైలు, SR 100,000 ఫైన్..!!
- యుద్ధం, ప్రాంతీయ ఉద్రిక్తతల పై కింగ్ హమద్, జెలెన్స్కీ చర్చలు..!!
- యూఏఈలో Dh1.046 బిలియన్లతో కొత్త డీశాలినేషన్ స్టేషన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై బ్రిటిష్, కువైట్ తో ఒమన్ చర్చలు..!!
- మే 13 నుండి 16 వరకు ఓల్డ్ దోహా పోర్టులో పిషింగ్ పోటీ..!!
- విమాన సర్వీసుల పై భారత్, కువైట్ చర్చలు..!!
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్









