ఖతార్:డిసెంబర్ 1 నుంచి కతార ట్రెడిషనల్ ధౌ ఫెస్టివల్
- November 24, 2020
దోహా:పల్లె సంస్కృతి, పాత తరాన్ని గుర్తు చేసే వస్తు సముదాయాలను ఇష్టపడే వారిని కతార్ ట్రెడిషనల్ ధౌ ఫెస్టివల్ మరోసారి స్వాగతం పలుకుతోంది. కతార బీచ్ వేదికగా డిసెంబర్ 1 నుంచి 5 వరకు ఈ ఫెస్టివల్ జరగనున్నట్లు కతార కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ ప్రకటించింది. ఈ ఐదు రోజుల ఉత్సవంలో ఖతార్ తో పాటు కువైట్, ఒమన్, ఇరాక్, జన్జిబర్ కూడా తమ పల్లె సంస్కృతి ఉట్టిపడేలా పలు వస్తువులను ఫెస్టివల్ లో సందర్శకులకు అందుబాటులో తీసుకురానున్నారు. అంతేకాదు..సముద్ర తీర ప్రాంతాల సాంప్రదాయక కళలను ప్రదర్శించనున్నారు. సముద్రంతో ముడిపడిన తమ జీవన విధానాన్ని, తమ వారసత్వ సంస్కృతిని తెలిపేలా కల్చరల్ ప్రొగ్రామ్స్ నిర్వహిస్తారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డు
- అనధికార అబార్షన్ ప్రమోటింగ్..ప్రవాసికి ఆరు నెలల జైలు, SR 100,000 ఫైన్..!!
- యుద్ధం, ప్రాంతీయ ఉద్రిక్తతల పై కింగ్ హమద్, జెలెన్స్కీ చర్చలు..!!
- యూఏఈలో Dh1.046 బిలియన్లతో కొత్త డీశాలినేషన్ స్టేషన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై బ్రిటిష్, కువైట్ తో ఒమన్ చర్చలు..!!
- మే 13 నుండి 16 వరకు ఓల్డ్ దోహా పోర్టులో పిషింగ్ పోటీ..!!
- విమాన సర్వీసుల పై భారత్, కువైట్ చర్చలు..!!
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్









