ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సిఎం జగన్
- November 24, 2020
అమరావతి: ప్రధాని నరేంద్రమోడి పలు రాష్ట్రల సిఎంలతో కరోనాపై చర్చించారు. ఈ సమావేశంలో ఏపి సిఎం జగన్ పాల్గొన్నారు. వ్యాక్సిన్ తయారీ, వ్యాక్సిన్ ముందు ఎవరికి ఇవ్వాలి, పంపిణీ సందర్భంగా అనుసరించాల్సిన పద్ధతులపై వీడియో కాన్ఫరెన్సులో చర్చించారు. ఈ సందర్భంగా మోడి మాట్లాడుతూ.. కరోనా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచానా వేయాలని సిఎంలకు సూచించారు. కొందరి నిర్లక్ష్యం వల్లే కేసుల సంఖ్య పెరుగుతుందని అసహనం వ్యక్తం చేశారు. కరోనా టెస్టుల సంఖ్యను ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని మోడి అభిప్రాయపడ్డారు. అనంతరం రాష్ట్ర అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు.
వ్యాక్సిన్ పంపిణీలో పాటించాల్సిన శీతలీకరణ పద్ధతులు, మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలనే విషయాలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా అధికారులను జగన్ ఆదేశించారు. ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద వ్యాక్సిన్ ను నిల్వ చేయడం, అదే ఉష్ణోగ్రతలో వాటిని మారుమూల ప్రాంతాలకు తరలించడం అనేవి చాలా కీలకమైన విషయాలని… దీనికి సమగ్రమైన ప్రణాళిక రచించాలని చెప్పారు. వివిధ కంపెనీల నుంచి సమాచారాన్ని సేకరించి అధ్యయనం చేయాలని అన్నారు. వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై కార్యాచరణను సిద్ధం చేయాలని చెప్పారు.
కాగా, తిరుమల పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులకు స్వాగతం పలికిన అనంతరం సిఎం జగన్ ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







