చిక్కుడు 65

- May 27, 2015 , by Maagulf
చిక్కుడు 65

కావలసిన పదార్ధాలు:

  • చిక్కుడుకాయలు              - 200 గ్రా
  • అల్లం వెల్లుల్లి ముద్ద            - 2 టీ స్పూన్లు
  • చిల్లీసాస్                          - 2 టీ స్పూన్లు
  • సోయాసాస్                       - 1 టీ స్పూను
  • మిరియాలపొడి                 - 1/2 టీ స్పూను
  • ఆరంజ్ రెడ్ కలర్               - చిటికెడు
  • ఉప్పు                             - తగినంత
  • కార్న్ ఫ్లోర్                      - 3 టేబుల్ స్పూన్లు
  • మైదా పిండి                      - 100 గ్రా
  • పచ్చిమిర్చి                      - 12
  • ఉల్లికాడలు                      - 2
  • వెల్లుల్లి రెబ్బలు                - 4
  • కరివేపాకు                        - 1/2 కప్పు
  • నూనె                              - వేయించడానికి సరిపడా

 

చేయు విధానం:

  • చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగి, ఈనెలు తీసి, రెండు ముక్కలుగా చేయాలి.
  • ఓ గిన్నెలో కార్న్ ఫ్లోర్, మైదాపిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, చిల్లీసాస్, మిరియాలపొడి, ఆరంజ్ రెడ్ కలర్, ఉప్పు వేసి సరిపడా నీళ్ళు పోసి పలుచగా కలపాలి.
  • ఇప్పుడు ఒక్కో చిక్కుడుకాయ ముక్కనూ ఈ పిండిలో ముంచి నూనెలో ఎర్రగా వేయించాలి.
  • మరో బాణీలో నూనె కొద్దిగా వేసి పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లికాడలు ముక్కలు, సోయాసాస్ వేసి వేగాక వేయించిన చిక్కుడుకాయ ముక్కలను వేసి కలిపితే చిక్కుడు 65 రెడీ..

------ జయంతి, సింగపూర్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com