మొబైల్ యాప్ తో భారత్ నేరుగా మనీ ట్రాన్స్ ఫర్..సర్వీసులు ప్రారంభించిన ఖతార్ బ్యాంక్
- November 25, 2020
ఖతార్ లో ఉంటున్న భారతీయులు..ఇక నుంచి భారత్ లోని తమ బంధువులకు డబ్బులు పంపించటం మరింత సులభం కానుంది. క్షణాల్లో ఇండియాలోని బ్యాంకు ఖతాలకు నగదు బదిలీ చేసేలా ఖతార్ ఇస్లామిక్ బ్యాంక్ మొబైల్ సర్వీసులను ప్రారంభించింది. కేవలం 60 సెకండ్లలో మనీ ట్రాన్స్ ఫర్ చేయవచ్చని బ్యాంక్ ప్రతినిధులు వెల్లడించారు. వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని..మొబైల్ యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. డెబిట్ కార్డు నెంబర్, పిన్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకొని ఇన్ స్టెంట్ సేవలు పొందవచ్చని తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు నగదు బదిలీలపై ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని, 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. నగదు బదిలీ కోసం ఖతార్ ఇస్లామిక్ బ్యాంక్...భారత్ లోని హెచ్.డీ.ఎఫ్.సీ. బ్యాంక్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి ఇండియాలోని బ్యాంకులకు మాత్రమే నగదు బదిలీ సేవలు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే ఇతర దేశాల్లోనూ మనీ ట్రాన్స్ ఫర్ స్కీంను అమలు చేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







