ఫుట్బాల్ దిగ్గజం డీగో మారడోనా ఇకలేరు
- November 26, 2020
బ్యూనస్ ఎయిర్స్లో:ఫుట్బాల్ లెజెండ్ డీగో మారడోనా కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మారడోనా బుధవారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మెదడు శస్త్రచికిత్స తరువాత బ్యూనస్ ఎయిర్స్లోని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన రెండు వారాల తరువాత గుండెపోటుతో మారడోనా మరణించానని ఆయన ప్రతినిధి సెబాస్టియన్ సాంచి తెలిపారు. మారడోనా మరణం పట్ల అర్జెంటీనా ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. 1960 లో జన్మించిన మారడోనా.. ఫుట్బాల్ ప్రపంచంలో ఎన్నో అరుదైన ఘనతలు సొంతం చేసుకున్నారు.. అర్జెంటీనాకు 1986 ప్రపంచ కప్ సాధించడం తోపాటు.. 1990 లో జట్టు ఫైనల్కు చేరడంలో ముఖ్య పాత్ర వహించారు. దురదృష్టవశాత్తు 1994 ప్రపంచ కప్ సమయంలో డోపింగ్ కేసులో దోషిగా తేలడంతో అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. 1997 రివర్ ప్లేట్ క్లబ్తో కెరీర్లో చివరి మ్యాచ్ ఆడారు మారడోనా.
తాజా వార్తలు
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!







