కోవిడ్ 19: టూరిస్ట్ స్పాట్స్ కి వెళ్లకండి...ప్రజలకు ఒమన్ ప్రభుత్వం హెచ్చరికలు

- November 26, 2020 , by Maagulf
కోవిడ్ 19: టూరిస్ట్ స్పాట్స్ కి వెళ్లకండి...ప్రజలకు ఒమన్ ప్రభుత్వం హెచ్చరికలు

మస్కట్:కోవిడ్ ముప్పు ఇంకా పొంచి ఉండటంతో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది ఒమన్ ప్రభుత్వం. దేశ పౌరులు, ప్రవాసీయులు ఎవరూ పర్యాటక ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది. ప్రస్తుతం ఒమన్ ప్రజలకు లాంగ్ లీవ్స్ వచ్చాయి. హాలీడేస్ ను ఎంజాయ్ చేసేందుకు పర్యాటక ప్రాంతాలకు వెళ్లటం, బంధువులతో సమూహంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒమన్ ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు సుప్రీం కమిటీ సూచించిన మార్గనిర్దేశకాలు ఇంకా అమలులోనే ఉన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని అధికారులు తెలిపారు. వీలైనంత వరకు పర్యటనలు మానుకోవాలన్నారు. అలాగే రోడ్ సైడ్ లాన్స్ లో ప్రజలు గుమికూడి ఉండొద్దని తెలిపారు. ఒమన్ లో పబ్లిక్ గ్యాదరింగ్స్ పై నిషేధం ఇంకా ఎత్తివేయలేదని వెల్లడించింది. సెలవు రోజులే కదా అని..సమీప బంధువులను ఇంటికి పిలిపించుకునే ప్రయత్నాలు కూడా మానుకోవాలని సూచించారు. ఇళ్లలో కూడా వీలైనంత వరకు భౌతిక దూరం పాటించటమే శ్రేయస్కరమని తెలిపారు. కోవిడ్ ను కంట్రోల్ చేసేందుకు సుప్రీం కమిటీ చేపట్టిన చర్యలకు ప్రజలు పూర్తి మద్దతుగా నిలబడాలని, ఈ మహమ్మారి కాలంలో పర్యటనలు, పార్టీలకు వెళ్లకుండా స్వీయ నియంత్రణ పాటించాలని అధికారులు కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com