భారత విదేశాంగ మంత్రికి షేక్ మొహమ్మద్ ఘన స్వాగతం
- November 26, 2020
అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జై శంకర్‌కి అబుదాబీలోని అల్ షాతి ప్యాలెస్‌లో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రితో షేక్ అహమ్మద్ పలు అంశాలపై చర్చించారు. రాజకీయ, ఆర్థిక అంశాలు వీరిద్దరి మధ్యా చర్చకు వచ్చాయి. అలాగే కరోనా వైరస్‌కి సంబంధించిన అంశాలు కూడా చర్చించినట్లు తెలుస్తోంది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపైనా ఇరువురూ చర్చించడం జరిగింది. భారత్ - యూఏఈ మధ్య మరింత మెరుగైన సంబంధాల కోసం ప్రధాని మోడీ కృషిని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ కొనియాడారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ డాక్టర్ అన్వర్ బిన్ మొహమ్మద్ గర్గాష్, అబుదాబీ ఎగ్జిక్యూటివ్ ఎఫైర్స్ అథారిటీ ఛైర్మన్ ఖల్దూన్ ఖలీఫా అల్ ముబారక్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







