కువైట్:హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసిన భారత రాయబార కార్యాలయం

- November 30, 2020 , by Maagulf
కువైట్:హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసిన భారత రాయబార కార్యాలయం

కువైట్ సిటీ:భారత రాయబార కార్యాలయం తన ప్రాంగణంలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది.కువైట్ లో ఉండే అక్రమ నిర్వాసితులు జరిమానాలు చెల్లించి నివాస అనుమతులు పునఃరుద్దరించుకోవడం లేదా దేశం విడిచి వెళ్ళిపోవడానికి డిసెంబర్ 01 నుండి 31 వరకు అవకాశం కల్పించింది. మరింత  సమాచారం కోసం రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్లను  అందుబాటులో ఉంచింది. ఈ  నెంబర్ లు: + 965-65806158, 65806735 ఉదయం 08:00 నుండి 10:00 వరకు. 10:00 నుండి 08:00వరకు  65807695, 65808923 +965 65809348 సంప్రదించవలసిన నెంబర్ లను ఉంచింది. ప్రయాణ పత్రాలు అవసరమయ్యే వారు కార్యాలయ సమయంలో హెల్ప్‌డెస్క్‌ను సందర్శించవచ్చు.  పాస్పోర్ట్ మరియు రెసిడెన్సీ లేని ఏ భారతీయ జాతీయుడైనా, ఇసి(అవుట్ పాస్)  కోసం దరఖాస్తు చేసుకోకపోతే, ఇసి ఫారమ్ నింపడం ద్వారా నమోదు  చేసుకోవచ్చు మరియు అల్-షర్క్, జలీబ్ అల్ షుయౌఖ్, ఫహహీల్ వద్ద ఉన్న భారతీయ పాస్పోర్ట్ కార్యాలయాలలో ఉంచిన బాక్ససుల లో కూడా జమ చేయవచ్చునని రాయబార కార్యాలయం తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com