పనీర్‌ మటన్‌

- February 18, 2016 , by Maagulf
పనీర్‌ మటన్‌

కావలసిన పదార్థాలు: బోన్‌లెస్‌ మటన్‌ - 500 గ్రా., పనీర్‌ - 150 గ్రా., కారం - 1 టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి - 10 రేకలు, పచ్చిమిర్చి - 4, లవంగాలు - 5, ఉల్లిపాయ - 1, దాల్చినచెక్క - అంగుళం ముక్క, యాలక్కాయ - 1, మిరియాలు - అర టీ స్పూను, జీలకర్ర - 2 టీ స్పూన్లు, దనియాలు - 2 టీ స్పూన్లు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు.

తయారుచేసే విధానం: మటన్‌లో కొద్దిగా నూనె, కారం, పసుపు, చిటికెడు ఉప్పు కలిపి మూత పెట్టి పక్కనుంచాలి. కడాయిలో దనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క, యాలక్కాయ, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, పచ్చిమిర్చి వేగించి అన్నీ కలిపి పేస్టు చేసుకోవాలి. ఇంకో కడాయిలో నూనె వేసి మసాల పేస్టు కారం, పసుపు, ఉప్పు కలపాలి. నూనె పైకి తేలిన తర్వాత మటన్‌ ముక్కల్ని వేసి బాగా కలిపి మూతపెట్టాలి. 10 నిమిషాల తర్వాత అర లీటరు నీరు పోసి చిన్న మంటపై మెత్తగా ఉడికించాలి. తర్వాత కొద్ది నూనెలో (దోరగా కాకుండా) వేగించిన పనీర్‌ను కలపాలి. 5 నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కర్రీ పరాటాతో పాటు అన్నంలోకి కూడా బాగుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com