భారత్ లోనే ఉత్తమ పోలీస్టేషన్ లలో ఒక్కటి గా జమ్మికుంట పోలీస్టేషన్...
- December 03, 2020
తెలంగాణ:భారత హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన అత్యుత్తమ పోలీస్ స్టేషన్ జాబితాలో మొదటి పది స్థానాల్లో తెలంగాణ రాష్ట్రం లోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్ పదవ స్థానం లో నిలిచింది. దీంతో రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి జిల్లా పోలీసులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ వ్యాప్తంగా మొత్తం పదహారు వేలకు పైగా పోలీస్ స్టేషన్ ల లో పది పోలీస్ స్టేషన్ లను ఉత్తమ పోలీస్ స్టేషన్ లుగా ప్రతి సంవత్సరం హోం శాఖ ప్రకటిస్తుంది. గత సంవత్సరం ఇదే జిల్లా చొప్పదండి పోలీస్ స్టేషన్. కు ఎనిమిదవ స్థానం రాగ ఈ సంవత్సరం జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు పదవ స్థానం రావడం టో కరీంనగర్ సి పీ కమలహాసన్ రెడ్డి జమ్మికుంట పోలీస్ సిబ్బంది కి శుభాకాంక్షలు తెలిపారు.జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపిక కావడం పట్ల రాష్ట్ర డి జి పి మహేందర్ రెడ్డి టో పాటు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఈటల రాజేందర్,గంగుల కమలాకర్ జిల్లా పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారన్నారు. ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపిక కావడం తో సిపి కమలహాసన్ రెడ్డి , ACP శ్రీనివాసరావు జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు వచ్చి సీఐ సృజన్ రెడ్డి ఎస్సై లను పోలీస్ సిబ్బంది నీ ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష