అబుదాబీ స్కూల్ ఎన్‌రోల్‌మెంట్స్ ఆదివారం నుంచి
- February 18, 2016
అబుదాబీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఎడిఇసి), ఎమిరేటి స్టూడెంట్స్ కోసం అబుదాబీ పబ్లిక్ స్కూల్స్‌లో ఎన్‌రోల్‌మెంట్ ప్రారంభ తేదీని ప్రకటించింది. ఆదివారం అనగా ఫిబ్రవరి 21 నుంచి మార్చ్ 17 వరకు ఈ ఎన్‌రోల్‌మెంట్‌కి అవకాశం ఉంది. నాన్ ఎమిరేటీ స్టూడెంట్స్‌కోసం రిజిస్ట్రేషన్ పీరియడ్‌ని 13 మార్చ్ నుండి 17 మార్చ్ దాకా నిర్ణయించడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఆపరేషన్స్ మహమ్మద్ సలీమ్ అల్ దామెరి మాట్లాడుతూ, ఎడిఇసి ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను చేపట్టిందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల 'స్టూడెంట్స్ ఎమిరేట్ ఐడి' ద్వారా రిజిస్టర్ చేసుకుని, స్కూల్స్‌ని విజిట్ చేయాల్సి ఉంటుంది. కిండర్‌గార్టెన్ కోసం ఎన్‌రోల్ చేసుకునే విద్యార్థులు 31 డిసెంబర్ 2016 నాటికి నాలుగు సంవత్సరాల కన్నా తక్కువ వయసుండాలి. గ్రేడ్ 1 కోసం ఆరు నుంచి ఎనిమిదేళ్ళ వయసుండాలి. తరగతి కెపాసిటీ (అప్రూవ్‌డ్‌పై ఎడిఇసి) మరియు జియోగ్రాఫికల్ ఏరియాస్‌ని బట్టి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఎడిఇసి వెబ్‌సైట్‌ని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







