అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించిన ప్రీతి తాతంభోట్ల
- February 18, 2016
కూచిపూడి నృత్యకారిణి పద్మశ్రీ శోభా నాయుడు గారి వద్ద శిష్యరికం చేసి , "తన్మయి" అనే ఆర్ట్ స్టూడియో ను దుబాయ్ లో స్థాపించి, కూచిపూడి లో నృత్య శిక్షణ అందిస్తున్నారు శ్రీమతి ప్రీతి తాతంభోట్ల .
ఇటీవల కాలంలో శిల్పారామం లో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు ప్రీతి.
"మామవతు శ్రీ సరస్వతి" అనే సరస్వతి దేవి ప్రార్థన తో ప్రదర్శన ప్రారంభించారు. ఆ తరువాత అన్నమాచార్య కీర్తన, 'మంగాంబుధి హనుమంత' అనే అంశాన్ని ప్రదర్శించారు ప్రీతి . ఈ అంశంలో ప్రీతి, భక్తి పారవశ్యం తో హనుమంతుని కొలుస్తూ నర్తించింది . ఖండిత నాయిక లక్షణాలుగల "వాని పొందు చాలు వద్దనే" అనే జావలి ని ప్రదర్శించి, ప్రేక్షకులను తన అభినయ చాతుర్యంతో మంత్రముగ్ధులను చేసింది శ్రీమతి ప్రీతి తాతంభోట్ల.
హైదరాబాద్ లోని "Hitex Convention Centre" లో ఇటివల జరిగన ఒక అంతర్జాతీయ సదస్సు లో మరో ప్రదర్శన కూడా ఇచ్హారు శ్రీమతి ప్రీతి తాతంభోట్ల.


తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







