జాజికాయ వల్ల ఉపయోగాలు

- December 04, 2020 , by Maagulf
జాజికాయ వల్ల ఉపయోగాలు

1. జాజికాయ మీ శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది. ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 
2. ఇందులో ఫైబర్ అధికంగా ఉన్నందున ఆకలిని తగ్గించేందుకు సహాయపడుతుంది. 
3. జాజికాయలో ఉన్న మాంగనీస్ శరీరంలో అధికంగా పేరుకున్న కొవ్వును కరిగించేందుకు సహాయపడుతుంది. 
4. జాజికాయ నిద్రలేమి ఇబ్బందులను తొలగిస్తుంది. రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలలో అర స్పూన్ జాజికాయ పొడి వేసుకుని తాగితే మంచి నిద్ర పడుతుంది. 
5. జాజికాయ ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు బరువు తగ్గాలంటే ఒత్తిడిని కూడా అదుపులో ఉంచుకోవాలి. 
ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. 
జాజికాయ కాలేయం, మూత్రపిండాల నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. దీనిలో ఉన్న నూనెలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్నందున, నోటి నుండి బ్యాక్టీరియాను తొలగించడంలో ఇది సహాయపడుతుంది.
జాజికాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని నివారించడంలో సహాయపడుతాయి. 
జాజికాయ పొడికి తగినంత తేనె కలిపి పేస్ట్ తయారు చేసి మొటిమలపై రాసి 20 నిమిషాలు ఉంచాలి. ఆపై గోరు వెచ్చని నీటితో కడగాలి. జాజికాయ పొడికి కొన్ని చుక్కల పాలను కలిపి పేస్ట్ తయారు చేసుకోవచ్చు. ఈ పేస్ట్‌తో శరీరంపై మసాజ్ మృత కణాలు తొలగిపోతాయి. 
బరువు తగ్గడం మాత్రమే కాదు, మధుమేహం, ఆర్థరైటిస్ వంటి రుగ్మతలను ఎదుర్కోవడంలో కూడా జాజికాయ సహాయపడుతుంది. అయితే గర్భవతులు లేదా అలెర్జీ లక్షణాలు ఉన్న వ్యక్తులు జాజికాయకు దూరంగా ఉండాలి. 
జాజికాయ పొడిని సూప్‌లు, గ్రీన్ టీలు, పప్పు మొదలైన వాటిల్లో వేసుకోవచ్చు. ఇది రుచికి చాలా చేదుగా ఉంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com